logo

Nizamabad: కోరం లేక మండల సమావేశం వాయిదా

జిల్లాలోని పెద్దకొడప్గల్‌ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాయిదా పడింది.

Published : 23 May 2024 17:00 IST

పెద్దకొడప్గల్‌: జిల్లాలోని పెద్దకొడప్గల్‌ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. కోరానికి సరిపడ సభ్యులు హజరు కాకపోవడంతో వాయిదా పడింది. మండల వైస్ ఎంపీపీ బోద్నం లక్ష్మీ అధ్యక్షతన ఎర్పాటు చేసిన ఈ సమావేశానికి కనీసం నలుగురు సభ్యులు హాజరు కావలసి ఉండగా.. వైస్ ఎంపీపీ తప్ప ఎవరూ హాజరు కాలేదు. దీంతో సమావేశం వాయిదా వేస్తున్నట్లు మండల వైస్ ఎంపీపీ బోధ్నం లక్ష్మీ ప్రకటించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ్, ఇన్‌ఛార్జి ఎంపిడీవో సూర్యకాంత్, ఏస్టీవో సుధర్శన్, వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని