logo

ఎవరి ప్రభావమెంత..?

2024 నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో ఎంత మంది ఉంటారనే లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 29 మంది బరిలో ఉన్నారు.

Published : 30 Apr 2024 05:40 IST

న్యూస్‌టుడే, నందిపేట్‌ గ్రామీణం: 2024 నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో ఎంత మంది ఉంటారనే లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 29 మంది బరిలో ఉన్నారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల సంగతి అటుంచితే.. మిగతా వారు ఎంత మేర ప్రభావం చూపుతారనే ఆసక్తి నెలకొంది. త్వరలో వారికి గుర్తులు కేటాయించనున్నారు. ప్రచారంలోకి దిగి ఎంతో మేర సఫలీకృతులవుతారో వేచి చూడాలి.

 నోటాకు తక్కువ కాకుండా..

 ఎంత మంది బరిలో ఉన్నారన్నది కాదు.. ఎంత గట్టి పోటీ ఇస్తారనేదే లెక్క. గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 185 మంది నిజామాబాద్‌ పార్లమెంటు నుంచి బరిలో నిలుచున్నారు. 181 మంది రైతులు నామినేషన్లు వేయగా.. ఇద్దరికి మాత్రమే 2 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో నోటాకు 2,031 ఓట్లు రావడం విశేషం. ఇది పోలైన ఓట్లలో 0.19 శాతం కావడం గమనార్హం. 2014 ఎన్నికల్లో 16 మంది బరిలో ఉండగా నోటాకు ఏకంగా 7,266 ఓట్లు వచ్చాయి. నోటా 0.70 శాతంతో ప్రధాన పార్టీల తర్వాతి స్థానం దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని