logo

రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌గా చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్‌ ఇస్తామని రైతులకు చేస్తున్న మోసాన్ని వదిలేది లేదని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ హెచ్చరించారు.

Published : 17 May 2024 05:29 IST

నిజాంసాగర్‌ చౌరస్తాలో ఆందోళనలో పాల్గొన్న గోవర్ధన్‌, జడ్పీ వైస్‌ఛైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌ తదితరులు

కామారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌గా చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్‌ ఇస్తామని రైతులకు చేస్తున్న మోసాన్ని వదిలేది లేదని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ హెచ్చరించారు. దొడ్డు వడ్లకు సైతం ప్రభుత్వం రూ.500 బోనస్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాకేంద్రంలో భారాస ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రాస్తారోకోలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రైతులకు అన్యాయం చేస్తే భారాస ఊరుకోదని, వారికి న్యాయం చేసే వరకు ఉద్యమిస్తామని గోవర్ధన్‌ అన్నారు. కొత్తగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ వస్తుందనే ధీమాతో ఆగస్టు 15వ తేదీ వరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెప్తున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. అనంతరం మానవహారం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో జడ్పీ వైస్‌ఛైర్మన్‌ పరికి ప్రేమ్‌కుమార్‌, నాయకులు పిప్పిరి ఆంజనేయులు, ప్రభాకర్‌రెడ్డి, మినుకూరి రాంరెడ్డి, రవికుమార్‌యాదవ్‌, బల్వంత్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, మోహన్‌రెడ్డి, అశోక్‌, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని