Andhra News: ‘సముద్రంలో కొట్టుకొచ్చిన ఆ మందిరం మయన్మార్ దేశానిది’
సంతబొమ్మాళి మండలంలోని ఎం.సున్నాపల్లి సముద్రం ఒడ్డుకు తుపాను ప్రభావంతో మంగళవారం కొట్టుకొచ్చిన మందిరాన్ని పోలి ఉన్న రథం మయన్మార్ దేశానికి చెందిందని అధికారులు గుర్తించారు. కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ ఆదేశాల మేరకు తహసీీల్దార్ చలమయ్య, మెరైన్ సీీఐ దేవుళ్లు, నౌపడ ఎస్.ఐ.సాయికుమార్లు వెళ్లి పరిశీలించారు.
మందిరం వద్ద తహసీల్దార్ చలమయ్య, ఇతర అధికారులు
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ఎం.సున్నాపల్లి సముద్రం ఒడ్డుకు తుపాను ప్రభావంతో మంగళవారం కొట్టుకొచ్చిన మందిరాన్ని పోలి ఉన్న రథం మయన్మార్ దేశానికి చెందిందని అధికారులు గుర్తించారు. కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ ఆదేశాల మేరకు తహసీీల్దార్ చలమయ్య, మెరైన్ సీీఐ దేవుళ్లు, నౌపడ ఎస్.ఐ.సాయికుమార్లు వెళ్లి పరిశీలించారు. బంగారు వర్ణంతో కూడిన రథంపై విదేశీభాష ఉండటాన్ని గుర్తించారు. వీటితో పాటు మందిరంపై 16-01-2022 తేదీ రాసి ఉంది. రథంపైన భాషను అంతర్జాలంలో శోధించగా అది మయన్మార్ దేశానికి చెందిందని, ఇది బంగారు రథం కాదని పేర్కొన్నారు. రెండేళ్ల కిందట ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతానికి ఇలాంటి రథమే ఒకటి కొట్టుకొచ్చిందని, అప్పట్లో అది శ్రీలంక దేశానికి చెందిందిగా గుర్తించారు. ఇదిలా ఉండగా దీన్ని మందిరంగా వినియోగించుకునేందుకు తమకు అవకాశమివ్వాలని ఎం.సున్నాపల్లి మత్స్యకారులు అధికారులను వేడుకున్నారు.
- న్యూస్‌టుడే, సంతబొమ్మాళి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
[ 27-04-2024]
‘పల్లెల్లో అందరూ కలిసి ముందడుగు వేయండి. ఒకే మాటపై నిలబడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తాం’ అని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల కిందట పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. -
95 ఆమోదం.. 28 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాఖలైన నామపత్రాల పరిశీలన శుక్రవారం జరిగింది. 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు. -
వైకాపా అభ్యర్థుల నామపత్రాలపై అభ్యంతరాలు
[ 27-04-2024]
-
కలమట బాధ్యతల స్వీకరణ
[ 27-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
ఓటర్లు 18,75,934 మంది
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఓటర్ల కొత్త జాబితా ఖరారైంది. ఈ నెల 15 నాటికి నమోదైనవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం!
[ 27-04-2024]
వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి.. పెళ్లిళ్లు కూడా జరిపించారు. -
దశాబ్దాల వ్యధ.. శంకుస్థాపనకే పరిమితమైన కథ..!
[ 27-04-2024]
మూడు వైపులా మహేంద్రతనయ నది నీరు, మరో వైపు పంట పొలాలు. గ్రామం నుంచి బయటకు రావాలంటే నాటు పడవే శరణ్యం ఇదీ హిరమండలంలోని జిల్లేడుపేట గ్రామస్థుల పరిస్థితి. -
చుక్కలు చూపిస్తున్నారు
[ 27-04-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని కొండి, పూజారి వీధులకు బోరు నీరే తాగు నీరు. బోరు వేసే సమయంలో 100 అడుగులు మాత్రమే తవ్వి వదిలేయడంతో క్రమేపీ నీటి లభ్యత తగ్గిపోయింది. -
ఇది మీ పాలనకు మచ్చు తునక
[ 27-04-2024]
వైకాపా పాలనలో రోడ్లు ఎలాంటి దీన స్థితిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇచ్ఛాపురంలోని పలు గ్రామాల్లోని రోడ్లు ఛిద్రమై వాహనదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. -
నగరమంతా.. ట్రాఫిక్ తంటా
[ 27-04-2024]
రోజురోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగరంలో నిత్యం ట్రాఫిక్ సవస్యలు అధికమవుతున్నాయి. డేఅండ్‌నైట్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి మిల్లు, పొట్టిశ్రీరాములు, ఏడురోడ్ల కూడళ్లలో వాహనాల రద్దీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
అరాచక పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని భాజపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదటి ఈశ్వరరావు అన్నారు. -
కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం ఖాయమని తెదేపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం
[ 27-04-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు.