logo

రాయితీ విత్తనాలు వచ్చేస్తున్నాయ్‌!

ఖరీఫ్‌కు సంబంధించి జిల్లా వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల వర్షాలు కూడా కురుస్తుండటంతో అన్నదాతలు సైతం పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈనేపథ్యంలో విత్తనాలను అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Published : 26 May 2022 06:22 IST

- న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం)

ఖరీఫ్‌కు సంబంధించి జిల్లా వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల వర్షాలు కూడా కురుస్తుండటంతో అన్నదాతలు సైతం పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈనేపథ్యంలో విత్తనాలను అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనాలను సరఫరా చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి కూడా రాయితీ ప్రకటన రావడంతో ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 30 మండలాల్లో వరి 1,62,719 హెక్టార్లలో సాధారణ సాగు చేస్తున్నారు. రాయితీపై వ్యవసాయశాఖ అధికారులు 41,283 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఇందులో గిరిజనులకు 2,220 క్వింటాళ్లు కేటాయించారు. వీరికి 90 శాతం రాయితీపై సరఫరా చేస్తున్నారు. 39,063 క్వింటాళ్లు కిలో రూ.10 చొప్పున రాయితీపై సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రతి 30 కిలోల బస్తాపై రూ.300 రాయితీ ఇస్తున్నారు.

పచ్చిరొట్ట కూడా..

భూసారాన్ని పెంచేందుకు వీలుగా జిల్లా రైతులకు ఈసారి 50 శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులో ఉంచారు. 1,450 క్వింటాళ్లలో జీలుగు, 1,824 క్వింటాళ్ల జనుమ విత్తనాలను ఏపీ సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. జీలుగు విత్తనం కిలో రూ.63.90 కాగా రైతు చెల్లించాల్సిన మొత్తం రూ.31.95గా నిర్దేశించారు. జనుము కిలో రూ.86 రాయితీ పోను రూ.43 చెల్లించాలి.

ఎరువులూ సిద్ధం...

ఆర్‌బీకేల్లో ఎరువులు కూడా సిద్ధంగా ఉంచుతున్నారు. ఖరీఫ్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. 76 ఆర్బీకేల్లో 632 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 1322 మెట్రిక్‌ టన్నుల యూరియా, 582 లీటర్ల నానో యూరియా రైతులకు సరఫరా చేసేందుకు అందుబాటులో ఉంచారు.

ఆర్బీకేల నుంచి తీసుకోవచ్ఛు. ఖరీఫ్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టాం. రైతులు కావాల్సిన వరి, పచ్చిరొట్ట విత్తనాలు, ఎరువులను డి-కృషి ద్వారా ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి నేరుగా రైతుభరోసా కేంద్రాల నుంచి తీసుకోవచ్ఛు ఎరువుల వినియోగంలో వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి.- కె.శ్రీధర్‌, జిల్లా వ్యవసాయాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని