logo

కటకటాల్లోకి నెట్టిన చిలుక జోస్యం!

రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అభ్యర్థులు ప్రచారాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated : 10 Apr 2024 07:38 IST

సెల్వరాజ్‌ వద్ద జోస్యం చెప్పించుకుంటున్న తంగర్‌బచ్చన్‌

వేళచ్చేరి, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అభ్యర్థులు ప్రచారాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఒక్కోసారి బెడిసికొట్టి ఆవతలివారికి ముప్పుతెచ్చి పెడుతున్నాయి. అందరి భవిష్యత్తును చెప్పే చిలుక జోస్యుడు తనకు వచ్చిన ఆపదను గుర్తించ లేకపోయాడు. చివరకు కటకటాలపాలయ్యాడు.

కడలూర్‌ నియోజకవర్గం నుంచి భాజపా కూటమిలోని పీఎంకే తరఫున తంగర్‌బచ్చన్‌ పోటీ చేస్తున్నారు. రెండు రోజుల కిందట ఆయన కడలూర్‌ తెన్నంబాక్కం ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో రోడ్డుపక్కన చిలుక జోస్యం చెప్పే వ్యక్తి వద్దకు వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వాటి ఆధారంగా తంగర్‌బచ్చన్‌కు చిలుక జోస్యం చెప్పిన సెల్వరాజ్‌ను వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద అరెస్టు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

ప్రజలు గుణపాఠం చెబుతారు: అన్బుమణి

సైదాపేట: డీఎంకే ప్రభుత్వ ప్రతీకార ధోరణికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్‌ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో.. కడలూరు జిల్లా తెన్నపాక్కం అళగుముత్తు ఆయ్యనార్‌ ఆలయంలో జోస్యం చెబుతూ వచ్చిన సెల్వరాజ్‌ అనే వ్యక్తిని తమిళనాడు ప్రభుత్వ అటవీశాఖ అరెస్టు చేసిందన్నారు. తంగర్‌బచ్చన్‌ విజయం సాధిస్తాడని చిలుక జోస్యం చెప్పటంతో ఓర్వలేని డీఎంకే ఈ ప్రతీకార చర్యకు పాల్పడిందన్నారు. అడవుల్లో లక్షల చెట్లు, వేల వన్యప్రాణులు మృతి చెందుతుంటే పట్టించుకోని ప్రభుత్వం జ్యోతిష్కుడి జీవనోపాధి దెబ్బతీసిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని