logo

‘ఇంగ నాన్‌తాన్‌ కింగు’ మోషన్‌ పోస్టర్‌ విడుదల

ఆనంద్‌ నారాయణ్‌ దర్శకత్వంలో నటుడు సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్‌తాన్‌ కింగు’. కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు ఎళిచ్చుర్‌ అరవిందన్‌. గోపురం ఫిలిం ప్రొడక్షన్‌ నిర్మించిన ఈ చిత్రంలో మనోబాలా, తంబి రామయ్య, మునిశ్‌కాంత్‌, బాల శరవణన్‌ తదితరులు నటించారు.

Published : 24 Apr 2024 00:02 IST

చిత్రంలోని ఓ సన్నివేశం

చెన్నై: ఆనంద్‌ నారాయణ్‌ దర్శకత్వంలో నటుడు సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్‌తాన్‌ కింగు’. కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు ఎళిచ్చుర్‌ అరవిందన్‌. గోపురం ఫిలిం ప్రొడక్షన్‌ నిర్మించిన ఈ చిత్రంలో మనోబాలా, తంబి రామయ్య, మునిశ్‌కాంత్‌, బాల శరవణన్‌ తదితరులు నటించారు. ప్రియాలయ ఈ చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు నాయికగా పరిచయమవుతున్నారు. మే 10న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో క్యారెక్టర్‌ రివీలింగ్‌ మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వెట్రివేల్‌ క్యారెక్టర్‌లో సంతానం, తేన్మొళిగా ప్రియాలయ, బాలాగా బాల శరవణన్‌, జమిందారు విజయకుమార్‌గా తంబి రామయ్య, బాడి బల్‌రామ్‌గా మునిశ్‌కాంత్‌ నటించారు.


శింబు సరసన నటించనున్న త్రిష?

చెన్నై, న్యూస్‌టుడే: దర్శకుడు మణిరత్నం, నటుడు కమల్‌హాసన్‌ కాంబోలో 34 ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, మెడ్రాస్‌ టాకీస్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయం రవి, త్రిష, నాజర్‌, అభిరామి, గౌతమ్‌ కార్తిక్‌, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు ఇతర తారాగణం. చిత్రంలో శింబు రెండు పాత్రలు పోషించనున్నారు. ఆయనకు జంటగా త్రిష నటించనున్నట్టు సమాచారం. ‘అలై’, ‘విణ్ణైతాండి వరువాయా’ చిత్రాల్లో వీరిద్దరు జంటగా నటించగా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ నటించనుండటం గమనార్హం.


సూర్య చిత్రంలో నటించే అవకాశం

‘కాస్టింగ్‌ కాల్‌’ పోస్టర్‌

చెన్నై: సూర్య 44వ చిత్రానికి కార్తిక్‌ సుబ్బురాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. పీరియాడిక్‌ గ్యాంగ్‌స్టర్‌, ప్రేమకథ నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సూర్య రెండు పాత్రలను పోషించనున్నట్టు సమాచారం. చిత్రీకరణ జూన్‌ 17న ప్రారంభంకానుంది. చిత్రంలో నటించడానికి ఆసక్తిగల వారికోసం కాస్టింగ్‌ కాల్‌ పోస్టర్‌ను తన ఎక్స్‌ పేజీలో దర్శకుడు కార్తిక్‌ సుబ్బురాజ్‌ విడుదల చేశారు. అందులో 8 నుంచి 80 ఏళ్ల వయసు వరకు ఉన్న మహిళలు, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చని, భాష అడ్డుకాదని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని