logo

పుస్తకాలను ప్రేమించండి : ముఖ్యమంత్రి పిలుపు

పుస్తకాలు చదవాలని, ప్రేమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు.

Published : 24 Apr 2024 00:03 IST

చెన్నై, న్యూస్‌టుడే: పుస్తకాలు చదవాలని, ప్రేమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. అందులో... పుస్తకాలు అనేవి కొత్త ప్రపంచానికి కొలమానం, మేథో ఊట, విద్యకు పునాది, భావాలకు ప్రేరణ, మార్పునకు సాధనం అంటూ అభివర్ణించారు. అవి మానవ సమాజాన్ని వికసించేలా చేస్తాయని తెలిపారు. పుస్తకాలను చదవాలని, ప్రేమించాలని, ఇతరులకు కానుకగా ఇచ్చి పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు తనకు కానుకగా అందిన రెండున్నర లక్షలకు పైగా పుస్తకాలను పలువురు విద్యార్థులు, గ్రంథాలయాలకు విరాళంగా అందించినట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని