logo

రీ రిలీజ్‌కు సిద్ధంగా విజయ్‌ సేతుపతి సినిమాలు

కోలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ‘వారణం ఆయిరం’, ‘వేట్టైయాడు విళైయాడు’, ‘3’, ‘విణ్ణైతాండి వరువాయా’ తదితర చిత్రాలు విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి.

Updated : 30 Apr 2024 01:27 IST

‘నడువుల కొంజం పక్కత్త కాణోం’లో ఓ సన్నివేశం
చెన్నై, న్యూస్‌టుడే: కోలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ‘వారణం ఆయిరం’, ‘వేట్టైయాడు విళైయాడు’, ‘3’, ‘విణ్ణైతాండి వరువాయా’ తదితర చిత్రాలు విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి. ‘గిల్లి’ చిత్రం ఏకంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రీ రిలీజ్‌ చిత్రాల బరిలోకి అజిత్‌ ‘బిల్లా’, ‘దీన’ కూడా చేరుతున్నాయి. అవి మే 1న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్‌ సేతుపతి నటించి విజయవంతమైన చిత్రాలను రీ రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 2012లో విడుదలైన ‘నడువుల కొంజం పక్కత్త కాణోం’, ‘ఇదర్కుతానే ఆశైపట్టాయ్‌ బాలకుమారా’ చిత్రాలను త్వరలో రీ రిలీజ్‌ చేయనున్నారు.


 రెట్ట తల చిత్రీకరణ ప్రారంభం

చిత్రబృందం విడుదల చేసిన పోస్టరు 

చెన్నై: తిరుకుమరన్‌ దర్శకత్వంలో అరుణ్‌ విజయ్‌ నటిస్తున్న చిత్రం ‘రెట్ట తల’. ఇది అరుణ్‌ విజయ్‌కు 36వ చిత్రం. సిద్ది ఇద్నాని, తన్యా రవిచంద్రన్‌ నాయికలు. ముఖ్య పాత్రలో బిగ్‌బాస్‌ బాలాజీ మురుగదాస్‌ నటించనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. చిత్రం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ గతవారం విడుదలైన నేపథ్యంలో సోమవారం చిత్రీకరణ పనులు ప్రారంభమైనట్టు పోస్టరు ద్వారా చిత్రబృందం వెల్లడించింది.


నడిగర్‌ సంఘానికి నెపోలియన్‌ రూ.కోటి విరాళం

చెన్నై: నడిగర్‌ సంఘం భవన నిర్మాణ పనులకు నటుడు నెపోలియన్‌ రూ.కోటి విరాళం అందించారు. ఆయనకు నడిగర్‌ సంఘం కృతజ్ఞతలు తెలిపింది. 2000-2006 మధ్యకాలంలో సంఘం ఉపాధ్యక్షుడిగా నెపోలియన్‌ వ్యవహరించారు. ఇప్పటికే నటులు కమల్‌హాసన్‌, విజయ్‌, ఉదయనిధి రూ.కోటి చొప్పున, శివకార్తికేయన్‌ రూ.50 లక్షలు విరాళాలు అందించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని