logo

నగదు మోసం కేసులో సినీ నిర్మాత అరెస్టు

కేరళలోని కొచ్చిన్‌కు చెందిన జానీ థామస్‌ మలయాళ సినీ నిర్మాత. ఇతనిపై కోవై వడవళ్లికి చెందిన ఉదయశంకర్‌ అనే వ్యక్తి సిటీ క్రైం బ్రాంచ్‌కు ఫిర్యాదు చేశారు.

Published : 17 May 2024 00:03 IST

జానీథామస్‌

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కేరళలోని కొచ్చిన్‌కు చెందిన జానీ థామస్‌ మలయాళ సినీ నిర్మాత. ఇతనిపై కోవై వడవళ్లికి చెందిన ఉదయశంకర్‌ అనే వ్యక్తి సిటీ క్రైం బ్రాంచ్‌కు ఫిర్యాదు చేశారు. తాను ప్రస్తుతం కెనడాలో ఉంటున్నానని, 2016లో ఖతర్‌ దేశంలో పని చేస్తుండగా జానీ థామస్‌తో పరిచయమై స్నేహితులుగా మారామన్నారు. నాన్సెన్‌ అనే చిత్రాన్ని నిర్మించేందుకు జానీథామస్‌కు రూ.2.75 కోట్లు అందిచానని చెప్పారు. 2018లో లాభ మొత్తంగా రూ.50 లక్షలు చెల్లించి అసలు ఇవ్వలేదని, అడిగితే బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు జానీ థామస్‌ను గురువారం అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని