logo

ఇతరులను గమనించడం నా పనికాదు

ఇతరులను గమనించడం తన పనికాదని, తన పనిపై తాను చాలా నిబద్ధతతో ఉన్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తెలిపారు.

Published : 18 May 2024 00:33 IST

ఇళయరాజా

 సైదాపేట, న్యూస్‌టుడే: ఇతరులను గమనించడం తన పనికాదని, తన పనిపై తాను చాలా నిబద్ధతతో ఉన్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తెలిపారు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న ‘కూలీ’ సినిమా టీజర్‌లో తన పాటను అనుమతి లేకుండా వాడారని ఇళయరాజా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటినుంచి ఆయన చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. ఓ కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయిత వైరముత్తు మాట్లాడుతూ... సంగీతానికి సమానమైంది భాష అని తెలుసుకోలేని వారు అజ్ఞానులు అని ఇళయరాజాను పరోక్షంగా దూషించారనే ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఇళయరాజా సోదరుడు గంగై అమరన్‌.. వైరముత్తును విమర్శించారు కూడా. ఈ నేపథ్యంలో ఇళయరాజా తన ఎక్స్‌ పేజీలో విడుదల చేసిన ఓ వీడియోలో.. తన గురించి ఏదో ఒక వీడియో ప్రతీరోజూ వస్తున్నట్లు తనకు కావల్సినవారు చెబుతున్నాôన్నారు. అయితే తాను దానిపై దృష్టి పెట్టడం లేదన్నారు. మిగతా వారిని గమనించడం తన పని కాదని, తన పనిపై నిబద్ధతతో ఉండటమే తన పనన్నారు. గత నెల కాలంలో ఒక సింఫొనీని రాసి పూర్తి చేశాననే సంతోషకరమైన వార్తను మీకు చెబుతున్నానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు