logo

భాజపాది తిరుగుబాటు రాజకీయం: సెల్వపెరుంతగై

భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు.

Published : 20 May 2024 00:08 IST

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. చెన్నై సత్యమూర్తిభవన్‌లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ... కులం, మతం, భాష రాజకీయాలు చేయకూడదని రాజ్యాంగం చెబుతుందన్నారు. కానీ మోదీ ప్రభుత్వం తిరుగుబాటు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. దానిని అడ్డుకోకుండా ఎన్నికల కమిషన్‌ వేడుక చూస్తోందన్నారు. ఓట్ల కోసం అయోధ్యలో రామాలయాన్ని నిర్మించారని ఆరోపించారు. తాను రాముడి భక్తుడినేని చెప్పారు. తామెలా రాముడి ఆలయాన్ని కూల్చివేస్తామన్నారు. కూల్చడం కాంగ్రెస్‌కు అలవాటు కాదని, నిర్మించడమే తెలుసన్నారు. మోదీ జీవితచరిత్రలో నటుడు సత్యరాజ్‌ నటిస్తే నిజాయతీగా నటించాలన్నారు. విద్య అంటే మహానాయకుడు కామరాజర్‌ గుర్తొస్తారన్నారు. అలాంటిది విద్య గురించి మాట్లాడే అర్హత భాజపాకు లేదన్నారు. నెల్లై జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జయకుమార్‌ మరణంపై న్యాయపరమైన విచారణ జరపాలన్నారు. కేసు సీబీసీఐడీకి మార్చాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు బానిసలుగా ఉండాలనే ఉచిత బస్సు పథకం గురించి ప్రధాని మోదీ తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని