logo

Vizag: సోమర్సెట్‌... బాహుబలి నౌక!

భారత్‌, అమెరికా దేశాల సైనిక సంబంధాలు బలోపేతమయ్యేలా బంగాళాఖాతంలో విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్‌ ట్రయంప్‌’ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతున్నాయని నేవీ అధికారులు తెలిపారు.

Updated : 24 Mar 2024 07:35 IST

విశాఖ తీరంలో విన్యాసాలు

యూఎస్‌ సోమర్సెట్‌ నౌక

సింధియా, న్యూస్‌టుడే : భారత్‌, అమెరికా దేశాల సైనిక సంబంధాలు బలోపేతమయ్యేలా బంగాళాఖాతంలో విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్‌ ట్రయంప్‌’ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతున్నాయని నేవీ అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. రెండు వారాలపాటు జరగనున్న ఈ విన్యాసాల కోసం బాహుబలి నౌకగా పేరొందిన ‘యూఎస్‌ సోమర్సెట్‌’ విశాఖ తీరానికి చేరుకుంది. ఇది ఉభయచర యుద్ధ నౌకగా ఖ్యాతిగాంచింది. దాదాపు 25 భారీ యుద్ధ ట్యాంకులు, నాలుగు యుద్ధ హెలికాఫ్టర్లు, నౌకకు అన్ని వైపులా ఆయుధ ట్యాంకులు, వెయ్యి మంది సిబ్బంది ఇందులో ఉండటం విశేషం. 2001 సెప్టెంబరు 11న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రవాదులు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన 93మంది స్మారకంగా ఈ నౌకను నిర్మించారు. విపత్తుల సమయంలో రక్షణ దళాలు ఈ నౌకను ఆసుపత్రిగా తీర్చిదిద్దిన కారణంగా అత్యాధునిక యుద్ధనౌకలలో ఒకటిగా ఇది చరిత్రలో నిలిచిపోయిందని నేవీ వర్గాలు వివరించాయి.

నౌక ప్రత్యేకతలు వివరిస్తున్న అధికారి

నౌకలో యుద్ధ ట్యాంకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని