logo

ఎక్కడికెళ్లినా రోడ్ల దుర్గతే చెబుతున్నారు!

అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు.

Updated : 03 May 2024 04:39 IST

ప్రత్యేక కారిడార్‌ ఏర్పాటుకు సహకరించండి
కేంద్ర మంత్రి గడ్కరీకి విన్నవించిన సీఎం రమేశ్‌

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని సత్కరిస్తున్న ఎన్డీయే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సీఎం రమేశ్‌, పంచకర్ల రమేశ్‌బాబు

ఈనాడు, విశాఖపట్నం, వేపగుంట, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలను కలుపుతూ ప్రత్యేక రహదారి నిర్మించాలని గడ్కరీని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ కోరారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో అనేక పరిశ్రమలు ఉన్నాయని, వాటిల్లో వేల మంది పని చేస్తున్నారన్నారు. ప్రచారాలకు వెళ్తున్నప్పుడు ప్రతీఒక్కరూ రోడ్ల గురించే చెబుతున్నారన్నారు. జాతీయ రహదారి మీద అరగంట సాగే ప్రయాణం ఈ రోడ్లలో వెళ్తే రెండు గంటల సమయం పడుతుందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక కారిడార్‌ను నిర్మించాలని కోరారు. జగన్‌ ప్రభుత్వం రహదారులను అధ్వానంగా తయారు చేసిందని విమర్శించారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు మాట్లాడారు. తెదేపా విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, అనకాపల్లి భాజపా అధ్యక్షుడు పరమేశ్వర్‌, మాజీ ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని