logo

కూటమితో బీసీలకు రాజ్యాధికారం: శ్రీభరత్‌

ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపాను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెదేపా కూటమితోనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం తెదేపా కూటమి అభ్యర్థి శ్రీభరత్‌ అన్నారు.

Published : 03 May 2024 04:20 IST

సమావేశంలో  తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌, పక్కన ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా, తదితరులు

గాజువాక, న్యూస్‌టుడే : ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపాను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెదేపా కూటమితోనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం తెదేపా కూటమి అభ్యర్థి శ్రీభరత్‌ అన్నారు. గురువారం గాజువాకలో నిర్వహించిన వెలమ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొలి నుంచీ వెలమలకు సముచిత స్థానం కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... వైకాపా పాలనలో అన్ని విధాలుగా నష్టపోయిన వర్గాలను ఆదుకుంటామన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించి, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. వెలమ సంఘం కో-ఆర్డినేటర్‌ వి.ఈశ్వరరావు, సభ్యులు జి.వెంకునాయుడు, జి.సత్యనారాయణ, సత్యనారాయణ, నాయుడు, దేవుడు, సత్యారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని