logo

ప్రజా సంక్షేమం కూటమితోనే సాధ్యం

రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు.

Updated : 03 May 2024 04:48 IST

ఎస్‌.రాయవరంలో అభివాదం చేస్తున్న అనిత

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. ఎస్‌.రాయవరం, ఉప్పరాపల్లి, వాకపాడు, వెంకటాపురం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర సంపద దోచుకుని, అభివృద్ధి, సంక్షేమం గాలికొదిలేశారని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, కందుల వెంకటేశ్వరరావు, తుంపాల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని 82వ వార్డు పరిధిలోని తాకాశివీధి, కుమ్మరవీధి, మల్లిమణుగులవారివీధి ప్రాంతాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. కొణతాల మాట్లాడుతూ వైకాపా పాలనలో ప్రజలు జీవన ప్రమాణాలు దిగజారాయన్నారు.

తెదేపాలోకి చేరిన వైకాపా నాయకులతో తెదేపా ఇన్‌ఛార్జ్‌ ప్రగడ నాగేశ్వరరావు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: తెదేపా అధికారంలో వచ్చిన వెంటనే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేదలకు నెలకు రూ. 4 వేల పింఛన్లు అందించడానికి చర్యలు తీసుకుంటారని తెదేపా ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. పూడిమడకలో వైకాపాకు చెందిన 100 కుటుంబాలకు చెందిన నాయకులు మేరుగు బాపునాయుడు నాయకత్వంలో తెదేపాలో చేరారు. వీరికి ప్రగడ స్వాగతం పలికారు. మేరుగు వెంకటరావు, పొన్నమళ్ల కొండబాబు, అచ్చియ్యనాయుడు పాల్గొన్నారు.

ఎలమంచిలి, న్యూస్‌టుడే: కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించడానికి తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ కోరారు. గురువారం ఆయన ఎలమంచిలిలో వార్డు ఇన్‌ఛార్జులు, నాయకులతో సమావేశం నిర్వహించి ఎన్నికల వ్యూహంపై చర్చించారు. గ్రామస్థాయి నుంచి ప్రచారం ముమ్మరం చేయాలన్నారు. గొర్లె నానాజీ, కొఠారు సాంబ పాల్గొన్నారు.

వైకాపా నుంచి తెదేపాలోకి..

పార్టీలో చేరిన వారితో పీలా

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి మండలం మాకవరానికి చెందిన వైకాపా నాయకులు రావి వెంకటరావు (బాబుల్‌ దొర) తన అనుచరులతో కలిసి తెదేపాలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో  గురువారం వీరికి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు గొంతిన శ్రీనివాసరావు, ఎం.నూకరాజు, వసాది సుదీర్‌, నారపిన్ని చంద్రశేఖర్‌, చల్లం నాయుడు పాల్గొన్నారు.

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: తుమ్మపాల పంచాయతీ చినబాబు కాలనీ యూత్‌ కమిటీ సభ్యులు గురువారం తెదేపాలో చేరారు.  కాండ్రేగుల రవికుమార్‌ ఆధ్వర్యంలో తోటాడ రాజేష్‌, చదరం ఆది, కొణతాల రాము, భీంపల్లి రాజుతో పాటు పలువురికి తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్‌ కండువా వేసి వీరిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రత్నాకర్‌ మాట్లాడుతూ తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాలు, ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వీరికి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని