logo

వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామపత్రం దాఖలు

వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ సోమవారం నామపత్రం దాఖలు చేశారు.

Updated : 23 Apr 2024 04:58 IST

రిటర్నింగ్‌ అధికారి మల్లికార్జునకు నామపత్రం అందజేస్తున్న బొత్స ఝాన్సీ, చిత్రంలో వాసుపల్లి గణేష్‌కుమార్‌, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ సోమవారం నామపత్రం దాఖలు చేశారు. పార్టీ ముఖ్య నాయకులు, కొద్దిమంది కార్యకర్తలు వెంటరాగా మూడు సెట్ల నామపత్రాలు సమర్పించారు. డమ్మీ అభ్యర్థిగా ఆమె కుమార్తె బొత్స అనూష ఒక సెట్‌ నామపత్రాలు అందజేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వైకాపా నాయకులు వాసుపల్లి గణేష్‌కుమార్‌, తిప్పల నాగిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, గొలగాని హరివెంకటకుమారి, ముత్తంశెల్లి శ్రీనివాసరావు, గుడివాడ అమర్‌నాథ్‌, కేకేరాజు పాల్గొన్నారు. ఎంవీపీకాలనీలోని బొత్స ఝాన్సీ కార్యాలయం నుంచి సోమవారం మధ్యాహ్నం సన్నిహితులు, ముఖ్య నాయకులతో కలిసి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ విశాఖను ప్రపంచ నగరంగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

కలెక్టరేట్‌ లోపలికి ఎక్కువ మంది వైకాపా కార్యకర్తలు వచ్చే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు కేవలం 11 మంది మాత్రమే రావాలని షరతు పెట్టారు. దీంతో మంత్రి బొత్స సూచించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. కొంతమంది పోలీసుల కళ్లుగప్పి లోపలికి రాగా వారిని వెంటనే బయటకు పంపేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని