logo

కూటమి మోగిస్తుంది విజయ దుందుభి

తెదేపా కూటమి జిల్లాలో విజయం సాధించడం ఖాయమని నేతలు పేర్కొన్నారు.

Published : 23 Apr 2024 04:37 IST

పీవీజీ, రామానాయుడులతో కలిసి నామినేషన్‌ అందజేస్తున్న సత్యనారాయణమూర్తి, చిత్రంలో కృష్ణ, సన్యాసినాయుడు

మాడుగుల/గ్రామీణం, చోడవరం, నక్కపల్లి, న్యూస్‌టుడే: తెదేపా కూటమి జిల్లాలో విజయం సాధించడం ఖాయమని నేతలు పేర్కొన్నారు. మాడుగుల స్థానానికి కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. పరవాడ మండలం వెన్నెలపాలెంలోని స్వగృహం నుంచి సతీమణి శ్రీదేవితో బయలుదేరిన ఆయన తొలుత చోడవరంలో స్వయంభూ విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు తదితరులు స్వాగతం పలికారు. కేజేపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజల అనంతరం నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. ర్యాలీగా బయలుదేరి మోదకొండమ్మ పాదాలను దర్శించి మాడుగుల చేరుకున్నారు. తహసీల్దారు కార్యాలయంలో ఆర్‌ఓ సత్యవాణికి రెండు సెట్ల నామినేషన్లు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, పీవీజీ కుమార్‌, పుప్పాల అప్పలరాజు, గవిరెడ్డి సన్యాసినాయుడు వెంట ఉన్నారు. ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌తో కలిసి నక్కపల్లిలో పేట తెదేపా అభ్యర్థిగా వంగలపూడి అనిత నామినేషన్‌ సమర్పించారు. తెదేపా, భాజపా, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

పాయకరావుపేట కూటమి అభ్యర్థిగా నామినేషన్‌ అందిస్తున్న వంగలపూడి అనిత, పక్కన ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌

జాతీయ రహదారిపై నక్కపల్లిలో కూటమి శ్రేణుల ర్యాలీ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని