logo

ముగిసిన ఐఐవైసీ వార్షిక సమావేశాలు

ఇస్కాన్‌ (సాగర్‌నగర్‌) ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఇస్కాన్‌ ఇండియా యూత్‌ కౌన్సిల్‌ (ఐఐవైసీ) వార్షిక సమావేశాలు గురువారం ముగిశాయి.

Published : 17 May 2024 02:53 IST

సాగర్‌నగర్‌, న్యూస్‌టుడే: ఇస్కాన్‌ (సాగర్‌నగర్‌) ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఇస్కాన్‌ ఇండియా యూత్‌ కౌన్సిల్‌ (ఐఐవైసీ) వార్షిక సమావేశాలు గురువారం ముగిశాయి. ఈ మేరకు ఇస్కాన్‌ కేంద్రం, రుషికొండ సాయిప్రియ రిసార్ట్స్‌ ప్రాంగణాల్లో గురువారం జరిగిన కార్యక్రమాల్లో ఐఐవైసీ ఛైర్మన్‌ సుందరగోపాల్‌ దాస్‌ మాట్లాడారు. భారతదేశంలోని యువత ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శ్రీకృష్ణ పరమాత్ముడి అనుగ్రహంతోనే విశాఖ వంటి సుందర నగరంలో ఇస్కాన్‌ ఏర్పాటు కావడం శుభ పరిణామమన్నారు. ఇస్కాన్‌ (విశాఖ శాఖ) సమక్షంలో చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యకలాపాల వివరాల్ని సంబంధిత అధ్యక్షుడు సాంబాదాస్‌, మాతాజీ నితాయిసేవిని తెలియజేశారు. రాధాకృష్ణులను ప్రత్యేకంగా అలంకరించి హరేరామ హరేకృష్ణ నామస్మరణతో భజనల నిర్వహణ, గీతాలాపనలు, భగవద్గీత ప్రవచనాలు చేశారు. పైడా కృష్ణప్రసాద్‌, డాక్టర్‌ పి.విశ్వేశ్వరరావు, రిసార్ట్స్‌ ఎండీ డి.ఆర్‌.కె.ప్రసాద్‌, దేశంలోని పలు ఇస్కాన్‌ కేంద్రాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో యువ ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని