logo

అభ్యర్థుల ఖర్చు వారి ఖాతాల్లోనే జమ

జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని వ్యయ పరిశీలకులు ప్రభాకర్‌ ప్రకాష్‌ రాజన్‌, ఆనందకుమార్‌, ఆకాష్‌దీప్‌ ఆదేశించారు.

Published : 20 Apr 2024 04:06 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి, చిత్రంలో వ్యయ పరిశీలకులు

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని వ్యయ పరిశీలకులు ప్రభాకర్‌ ప్రకాష్‌ రాజన్‌, ఆనందకుమార్‌, ఆకాష్‌దీప్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ నాగలక్ష్మితో కలిసి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సహాయ వ్యయ పరిశీలకులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్నందున అభ్యర్థికి సంబంధించిన ఖర్చులను వారి ఖాతాల్లోనే జమ చేయాలని సూచించారు. బ్యాంకుల్లో జరిగే లావాదేవీలపై దృష్టి సారించాలని, ఈ మేరకు రోజూ నివేదికలను అందించాలని స్పష్టం చేశారు.

రూ.92 లక్షలు స్వాధీనం : జిల్లాలో మార్చి 16 నుంచి శుక్రవారం వరకు రూ.92 లక్షల నగదు, రూ.42 లక్షల విలువైన మద్యం, రూ.29 లక్షల మత్తు పదార్థాలు, రూ.1.81 కోట్ల విలువైన బంగారు, వెండి వస్తువులు, రూ.74 లక్షల విలువైన ఇతర సామగ్రిని సీజ్‌ చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. జేసీ కార్తీక్‌, సహాయ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌, అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్‌, డీఆర్వో అనిత తదితరులు పాల్గొన్నారు.

నేడు రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకురాలి రాక

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగం శనివారం జిల్లాకు రానున్నారు. శ్రీకాకుళం నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విజయనగరం చేరుకుంటారు. రాత్రి 7 గంటల వరకు కలెక్టర్‌, వ్యయ పర్యవేక్షణ బృందాలతో సమీక్షిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని