logo
Published : 29/11/2021 02:18 IST

చలికి వణుకు..నేలపైనే కునుకు

నిద్రించేందుకు మంచాలు లేక.. చలికి తట్టుకోలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.నరసాపురం మండలం ఎల్బీచర్ల బాలయోగి గురుకుల బాలుర పాఠశాలలో 480 మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వం వీరికి రెండేళ్లుగా దుప్పట్లు ఇవ్వడం లేదు. మంచాలు లేవు. కొవిడ్‌ ఉద్ధృతి సమయంలో పాలకొల్లు టిడ్కో గృహాల్లో ఏర్పాటుచేసిన ఐసొలేషన్‌ కేంద్రానికి పాఠశాలలోని 273 మంచాలను తరలించారు. వాటిని తిరిగి తీసుకురాకపోవడంతో విద్యార్థులు చాపలపై నిద్రిస్తున్నారు. విషయాన్ని ప్రిన్సిపల్‌, ఆ శాఖ ఉన్నతాథికారులు పాలకొల్లు పుర అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. అక్టోబరులో స్పందన కార్యక్రమంలో కలెక్టరు దృష్టికి తీసుకెళ్లగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అయినప్పటికీ మంచాలు పంపలేదు. ప్రస్తుతం చలిగాలులకు విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మణేశ్వరం నక్కావారిపేట మహాత్మా జ్యోతిరావు ఫులే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 130 మంచాలను పాలకొల్లుకు తరలించారు. వాటినీ తిరిగి పంపలేదు. ఇక్కడ 410 మంది విద్యార్థినులు ఉన్నారు. - న్యూస్‌టుడే, నరసాపురం

మంచాలను తరలిస్తున్న వాహనం (పాత చిత్రం)​​​​​​​

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని