logo

Andhra News: హనీట్రాప్‌.. వీడియోకాల్‌ లింక్‌ పంపి రూ.2.5లక్షలు కాజేసిన యువతి

ఫేస్‌బుక్‌లో యువతి పరిచయం ఓ యువకుడి కొంపముంచింది. వలపు వల వేసి యువకుడి ఖాతాలో నుంచి రూ.2,50,000 కాజేసింది. చేబ్రోలు పోలీసుల కథనం ప్రకారం....బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురం సమీపంలోని జాంద్రపేటకు చెందిన

Updated : 27 May 2022 08:50 IST

ఉంగుటూరు, న్యూస్‌టుడే: ఫేస్‌బుక్‌లో యువతి పరిచయం ఓ యువకుడి కొంపముంచింది. వలపు వల వేసి యువకుడి ఖాతాలో నుంచి రూ.2,50,000 కాజేసింది. చేబ్రోలు పోలీసుల కథనం ప్రకారం....బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురం సమీపంలోని జాంద్రపేటకు చెందిన దేవాన గణేష్‌ జీవనోపాధి నిమిత్తం ఉంగుటూరు మండలం చేబ్రోలు వచ్చాడు. స్థానికంగా ఓ పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల కిందట ఫేస్‌బుక్‌ ద్వారా ప్రీతి అనే పేరుతో ఓ యువతి పరిచయమైంది. అనంతరం టెలిగ్రామ్‌లో ఇద్దరూ సందేశాలు పంపుకొన్నారు. వీడియో కాల్‌ చేసుకుందామని యువతి ఒక లింక్‌ను గణేష్‌ చరవాణికి పంపింది. ఆశతో గణేష్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని యువతితో మాట్లాడటం ప్రారంభించాడు.

ఈ క్రమంలో ఈ నెల 23న రాత్రి ఇద్దరూ చరవాణిలో మాట్లాడుతుండగా తన నెట్‌ బ్యాలెన్స్‌ గడువు ముగిసిపోతుందని, రూ.20 తన ఖాతాకు జమ చేయాలని యువతి కోరింది. వెంటనే యువతి చెప్పిన ఖాతాకి గణేష్‌ రూ.20 జమ చేశాడు. కొద్ది సేపటికి తన ఖాతా నుంచి రూ.2,50,000 డెబిట్‌ అయినట్లు గణేష్‌ చరవాణికి సందేశం రావడంతో కంగుతిన్నాడు. బ్యాంకుకి వెళ్లి ఆరా తీయగా ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌లోని ఓ బ్యాంకు ఖాతాకు బదిలీ అయినట్లు తెలిసింది. తాను మోసపోయానని గ్రహించిన గణేష్‌ పోలీసులను ఆశ్రయించాడు. నగదు కాజేసిన ఘటనపై పోలీసులకు చెబితే తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని యువతి సందేశాలు పంపిందని గణేష్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు