logo
Published : 30/11/2021 03:34 IST

శ్రీశైలం రహదారిలో రెండు కార్లు ఢీ

ఇద్దరి పరిస్థితి విషయం.. ఆరుగురికి తీవ్ర గాయాలు

ఘటనాస్థలంలో ఢీకొన్న రెండు కార్లు

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే: శ్రీశైలం -హైదరాబాద్‌ జాతీయ రహదారిలో రెండు కార్లు ఢీకొని ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఎస్సై అజ్మీరా రమేష్‌ కథనం ప్రకారం.. కూకట్‌పల్లి నుంచి శ్రీశైలం వెళ్లేందుకు హోండా సిటీ కారు, శ్రీశైలం నుంచి హైదరాబాద్‌(ఎల్‌బీనగర్‌) వెళ్లేందుకు ఇన్నోవా బయలుదేరాయి. సోమవారం ఉదయం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలంలోని ఈరట్వానిపల్లి గేటు సమీపంలో ఎదురెదురుగా రెండు ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనలో కూకట్‌పల్లికి చెందిన బ్రహ్మలింగేశ్వరరావు, స్వామినాయుడు తీవ్రంగా గాయపడ్డారు. సాయినాథ్‌, సుజాత, శైలజ, గంగాభవానీ స్వల్ప గాయాలయ్యాయి. బ్రహ్మలింగేశ్వరరావు, గంగాభవానీ దంపతులు కాగా.. వారి సుజాత, శైలజ కుమార్తెలు, వారి సమీప బంధువు స్వామినాయుడు, ఆయన కుమారుడు సాయినాథ్‌ ఇద్దరు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన స్వామినాయుడు, సాయినాథ్‌తో పాటు మరో నలుగురిని హైదరాబాద్‌ తరలించారు. ఎల్‌బీనగర్‌కు చెందిన ఆంజనేయులు, భాగ్యమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని