logo
Published : 03/12/2021 01:15 IST

వావ్‌.. భౌ భౌ సంరక్షణ!

మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కుక్కల పెంపకం ఎంతో దోహదం చేస్తుందనేది నిపుణుల మాట. దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంట్లో ఒక కుక్క ఉంటే ఎంతో రక్షణ అనేది చాలామందికి అనుభవం. అందుకే శునకాల పెంపకం, అనంతరం వాటిని అవసరమైన వారికి విక్రయించడమనేది ఉపాధిగా కొందరు ఎంపిక చేసుకుంటున్నారు. నర్సాపూర్‌ పట్టణానికి చెందిన సాధుకృష్ణ శివాలయం వీధిలో వివిధ జాతుల శునకాలను పెంచుతున్నారు. ఐటీఐ పూర్తి చేసి ప్రైవేటు పరిశ్రమలో కార్మికుడిగా పని చేశారు. ఏడాది వ్యవధిలో తండ్రి, సోదరుడు బలవన్మరణాలకు పాల్పడటంతో తల్లి యాదమ్మ, మరో తమ్ముడు ప్రదీప్‌ పోషణ భారం కృష్ణపై పడింది. తండ్రి సాధు వెంకటేశ్‌ శునకాలను పెంచారు. ఈ క్రమంలో కృష్ణకు పెంపకంపై అవగాహన ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి కొని తీసుకొస్తారు. గోల్డెన్‌ రిట్రీవర్‌, జర్మన్‌ షెపర్డ్‌, లాబ్రడార్‌, బెల్జియన్‌ మలినాయిస్‌, పగ్‌, డాబర్‌మ్యాన్‌ తదితర రకాలున్నాయి. వాటికి షెడ్లు ఏర్పాటు చేశారు. నర్సాపూర్‌ పశువుల ఆసుపత్రిలో ఏడీగా పనిచేసి పదవీ విరమణ పొందిన డాక్టర్‌ అర్జున్‌ సహకారంతో పెంపకంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. వీటి పెంపకంపై మల్కాజిగిరిలో శిక్షణ సైతం పొందారు. ప్రస్తుతం కృష్ణ వద్ద 20 కుక్కలు ఉన్నాయి. ఎనిమిది నెలల పాటు వాటిని పెంచి ఇతరులకు విక్రయిస్తారు. కుక్కలకు హాస్టల్‌ వసతి నిర్వహిస్తున్నామని, ఉన్నత కుటుంబాల వారు మాకు అప్పగిస్తే కంటికి రెప్పలా కాపాడుతున్నామని.. తద్వారా ఉపాధి పొందుతున్నామని.. సాధు కృష్ణ వివరించారు. 

- న్యూస్‌టుడే, నర్సాపూర్‌

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని