icon icon icon
icon icon icon

Brij Bhushan: బ్రిజ్‌ భూషణ్‌కు టికెట్‌ కట్‌..!

ఉత్తరప్రదేశ్‌ బాహుబలి నేతల్లో ఒకరైన బ్రిజ్‌భూషణ్‌కు ఈ సారి భాజపా టికెట్‌ కట్‌ చేసినట్లు తెలుస్తోంది. 

Published : 02 May 2024 11:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వివాదాస్పద భాజపా నేత, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan)కు ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ కట్‌ చేసినట్లు తెలుస్తోంది. కైసర్‌గంజ్‌ నుంచి అతడు ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి రెజ్లర్ల ఆందోళన ఫలితంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలే ఓ ఆంగ్ల వార్తా ఛానెల్‌కు వెల్లడించాయి. కాకపోతే అతడి కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌కు టికెట్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు బ్రిజ్‌ భూషణ్‌ మాత్రం పార్టీ అభ్యర్థుల జాబితాలో స్థానం దక్కించుకొనేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఐదో విడతలో భాగంగా మే20వ తేదీన కైసర్‌గంజ్‌లో పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ నామినేషన్‌ దాఖలు చేయడానికి తుదిగడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో భాజపా నేడు అభ్యర్థని ప్రకటించే అవకాశాలున్నాయి. 

జాతీయ రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణ విషయంలో బ్రిజ్‌భూషణ్‌ దాదాపు రెండేళ్లుగా వార్తల్లో నానుతున్నారు. గతేడాది ఆయన రెజ్లింగ్‌ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా క్రీడా రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లు ప్రకటించారు. తన స్థానంలో సన్నిహితుడైన సంజయ్‌సింగ్‌ను ఎంపికయ్యేందుకు కృషి చేశాడు. 

బ్రిజ్‌భూషణ్‌ ఉత్తరప్రదేశ్‌లో అతిపెద్ద బాహుబలి నేతల్లో ఒకరిగా పేరున్న వ్యక్తి. ఎంపీగా ఏకంగా ఆరుసార్లు పార్లమెంట్‌లో అడుగుపెట్టిన నాయకుడు. భారీ సంఖ్యలో కేసులు ఉన్నా రకరకాల రాజ్యాంగ పదవులను అనుభవిస్తున్నాడు. భారీ ఎత్తున విద్యాసంస్థలు, అఖాడాలు నిర్వహిస్తూ యువతలో పాపులారిటీ సంపాదించాడు. యూపీలోని గోండా చుట్టుపక్కల అరడజను జిల్లాలో బ్రిజ్‌భూషణ్‌ హవా కనపడుతుంది. ఈ నేపథ్యంలో భాజపా ఇతడి విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవడం లేదనే విమర్శలను ఎదుర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img