icon icon icon
icon icon icon

Arvind Kejriwal: షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్‌

Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్‌ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు.

Published : 16 May 2024 14:08 IST

Arvind Kejriwal | లఖ్‌నవూ: ప్రధాని మోదీ రిటైర్మెంట్‌ గురించి ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ప్రధానిని చేసేందుకు మోదీ ఓట్లడుగుతున్నారని చెప్పారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ను కూడా తొలగిస్తారని జోస్యం చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. మనీలాండరింగ్‌ కేసులో విడుదలైన తర్వాత తొలిసారి కేజ్రీవాల్‌.. మోదీ రిటైర్మెంట్‌ గురించి ప్రస్తావించారు. దీన్ని అమిత్‌ షా ఖండించారు. అధికారంలోకి వస్తే మూడోసారీ మోదీనే ప్రధానిగా కొనసాగుతారని చెప్పారు. మరో మూడు విడత ఎన్నికలు మిగిలిన ఉన్న వేళ దీని గురించి మరోసారి కేజ్రీవాల్‌ మాట్లాడారు.

ప్రధానిపై పోటీ.. కమెడియన్‌ శ్యామ్‌ రంగీలాకు షాక్‌

‘‘యూపీ ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. అమిత్‌ షాను ప్రధాన మంత్రిని చేసేందుకే మోదీ ఓట్లడుగుతున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 17 నాటికి ఆయనకు 75 ఏళ్లు నిండుతాయి. మళ్లీ గెలిస్తే తన వారసుడిగా అమిత్‌ షాను మోదీ కూర్చోబెడతారు. ఎందుకంటే ఈ నిబంధన పెట్టిందే ఆయన. కాబట్టే దీని గురించి ఎక్కడా మోదీ మాట్లాడడం లేదు. అంతే కాదు.. ఒకవేళ మూడోసారి భాజపా అధికారంలోకి వస్తే రెండు మూడు నెలల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా ఆ పదవి నుంచి తొలగిస్తారు. రాజ్యాంగాన్ని మార్చేసి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తారు’’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

220 కూడా కష్టమే..

భాజపా అనుకున్నట్లు ఆ పార్టీ మరోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదని కేజ్రీవాల్‌ అన్నారు. జూన్‌ 4న అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమేనని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రస్తుత ట్రెండ్స్‌ ప్రకారం చూస్తే.. భాజపాకు 220కు మించి సీట్లు రావని చెప్పారు. హరియాణా, దిల్లీ, పంజాబ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, యూపీ, బిహార్, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌లో ఆ పార్టీకి సీట్లు భారీగా తగ్గబోతున్నాయని చెప్పారు. అందుకే కేంద్రంలో భాజపా అధికారం చేపట్టడం కష్టమని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img