icon icon icon
icon icon icon

16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్‌ గల్లంతే

డిపాజిట్‌.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్‌ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు.

Published : 30 Apr 2024 12:46 IST

డిపాజిట్‌.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్‌ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత రిటర్నింగ్‌ అధికారి వద్ద డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఫలితాల తర్వాత డిపాజిట్‌ రుసుము తిరిగి పొందాలంటే పోలైన ఓట్లలో ఆరో వంతు అంటే 16 శాతం ఓట్లు పొందడం తప్పనిసరి. లేదంటే నిర్దేశిత సమయం కంటే ముందే నామపత్రాన్ని ఉపసంహరించుకుంటే సొమ్ము తిరిగి ఇచ్చేస్తారు. లేదంటే ఆ రుసుం ఎన్నికల సంఘానికే చెందుతుంది. గత ఎన్నికల్లో ప్రధాన, స్వతంత్ర అభ్యర్థులు సైతం పలువురు డిపాజిట్‌ కోల్పోవడం గమనార్హం. ఈసీ వద్ద ఉన్న సమాచారం మేరకు దేశంలో 1951 నుంచి 2019 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 91,160 మందిలో 71,245 (78 శాతం) మంది డిపాజిట్‌లు కోల్పోయారు. 1957లో అతి తక్కువగా 130 మంది ఉండగా, 1996లో అత్యధికంగా 12,688 మందికి డిపాజిట్‌లు దక్కలేదు. 2019 ఎన్నికల్లో 610 మందికి డిపాజిట్‌లు గల్లంతయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img