icon icon icon
icon icon icon

Vote Challenge: రూ.2తో ఓటు ఛాలెంజ్

ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్‌కు మాత్రమే ఉంటుంది.

Published : 07 May 2024 13:55 IST

ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్‌కు మాత్రమే ఉంటుంది. పోలింగ్ బూత్‌లోకి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఓటరు జాబితాలో ఉన్న పేరుకు సరిపోదని అనుమానం కలిగినప్పుడు ఏజెంట్ ప్రిసైడింగ్ అధికారికి రూ.2 చెల్లించి సవాల్ చేయడానికి అవకాశం ఉంది. ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి వయసు, తండ్రి పేరు, గుర్తింపు కార్డును పరిగణనలోకి తీసుకుని అతడి బంధువులు లేదా ఓటరు జాబితాలో అతని ఇంటి దగ్గర్లోని వారిని సాక్షులుగా నియమించి వారితో ప్రమాణం చేయించి విచారణ చేపడతారు. సదరు ఓటరు బోగస్ అని తేలితే అతడిపై ఫిర్యాదు చేసి పోలీసులకు అప్పగిస్తారు. ఒకవేళ జాబితాలో ఉన్న విధంగా ఓటరే అయితే ఓటు వేయడానికి అనుమతిచ్చి, సవాల్ చేసిన ఏజెంట్ ఓడిపోయినట్లు తీర్మానించి అతను చెల్లించిన రూ.2ను ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఒక వేళ ఏజెంట్ తన సవాల్లో గెలిస్తే రూ.2ను తిరిగి పీఓ ఏజెంట్‌కు ఇచ్చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img