icon icon icon
icon icon icon

ఓటు.. సుదీర్ఘ ప్రయాణం

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక పౌరులందరికీ సార్వత్రిక ఓటును వినియోగించుకునే కల సాకారమైంది.

Updated : 09 May 2024 11:13 IST

ఓటుది సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రయాణం ఓ ఆంగ్లేయుల కాలంలో మొదలైంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక పౌరులందరికీ సార్వత్రిక ఓటును వినియోగించుకునే కల సాకారమైంది. 1907లో ఏర్పడిన రాయల్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటు ఉపయోగించుకునే విషయంపై చేసిన సిఫార్సులతో 1909లో కౌన్సిల్ చట్టం పరిమిత ప్రాతిపదికన భారతీయులకు ఓటు పొందే హక్కును కల్పించింది. 1919 కౌన్సిల్ చట్టం ఓటును వినియోగించుకునే అవకాశాన్ని మరింత విస్తృత పరిచింది. 1935లో ఓటు హక్కును దేశ జనాభాలో 10.5 శాతం మంది ఉపయోగించుకునేలా చేసింది. 1947లో రాజ్యాంగ పరిషత్ ఎన్నికల సందర్భంగా దాన్ని 28.5 శాతానికి పెంచారు. స్వాతంత్య్రానంతరం సార్వత్రిక వయోజనులందరికీ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ఆ పద్ధతిలో 1952 నుంచి దేశంలో వివిధ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును వయోజనులు ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠం చేయడం వల్ల నేడు అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా భారత్ విరాజిల్లుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img