icon icon icon
icon icon icon

ఒక్కసారి మాత్రమే గెలిచారు..

భువనగిరి లోక్‌సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు.

Published : 01 May 2024 12:50 IST

భువనగిరి లోక్‌సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. 2009లో నియోజకవర్గం ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కసారి గెలిచిన అభ్యర్థి మళ్లీ పోటీ చేసినా గెలుపొందలేదు. 2009 కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి మొదటి సారి పోటీచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి అనూహ్యంగా గెలుపొందారు. తెదేపా, తెరాస, మద్దతుతో పోటీ చేసిన సీపీఎం సీనియర్‌ నేత నోముల నర్సయ్యపై 1,39,888 మెజారిటీతో విజయం సాధించి  సంచలనం సృష్టించారు. ఇక 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రెండోసారి పోటీచేసిన రాజగోపాల్‌రెడ్డి తప్పకుండా గెలుస్తారని అందరూ భావించినా అంచనాలు తలకిందులు చేస్తూ తెరాస అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ 30,544 మెజార్టీతో విజేతగా నిలిచారు. ఇక రెండో సారి 2019లో పోటీ తిరిగి తెరాస తరఫున పోటీ చేసిన నర్సయ్యగౌడ్‌ రెండో సారి ఓటమిని చవిచూశారు. మునుగోడు మినహా అన్ని పార్లమెంట్‌ స్థానాల్లో తెరాస ఎమ్మెల్యేలు ఉన్నా నర్సయ్యగౌడ్, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 5,219 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. రెండో సారి పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డి, డాక్టర్‌ బూర నర్సయ్య ఓటమి చెందగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ అసెంబ్లీకి ఎన్నికై మంత్రి కావడంతో రెండో సారి పోటీ చేయలేదు. మూడో సారి పోటీ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూర నర్సయ్యగౌడ్‌ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.   - న్యూస్‌టుడే, భువనగిరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img