icon icon icon
icon icon icon

Chandrababu: సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పింఛను ఎందుకివ్వరు?: చంద్రబాబు

వైకాపా కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు.

Updated : 29 Apr 2024 13:30 IST

గూడూరు: వైకాపా కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటున్నారని.. మండుటెండల్లో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా గూడూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్‌ చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రభుత్వ సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పింఛను ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. ఎన్నికల అధికారులు చెప్పినా రాష్ట్ర అధికారులు వినే పరిస్థితి లేకుండా పోయిందని.. కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. ఒక పార్టీ, ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం పనిచేసే అధికారులు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమన్నారు. పింఛను తీసుకునేందుకు వెళ్లే క్రమంలో ఏ ఒక్కరు చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని.. తప్పుడు రాజకీయాలు చేసి నాటకాలు ఆడొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జవహర్‌రెడ్డి జగన్నాటకం

‘‘బ్యాంకుల్లో నగదు జమ చేస్తే తీవ్రమైన ఎండలో వృద్ధులు ఎలా వెళ్తారు?గత నెలలో సచివాలయాల చుట్టూ తిప్పించారు.. ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిప్పిస్తున్నారు. కుంటిసాకులతో వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు లేవని గత నెలలో చెప్పారు.. అప్పుడు లేని వివరాలు ఇప్పుడెలా వచ్చాయి?’’ అని చంద్రబాబు నిలదీశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img