Female Bodybuilder : కండలు తిరిగిన అందాల రాక్షసి!
రష్యాకు (Russia)చెందిన ఓ అందాల బాడీ బిల్డర్ (Bodybuilder)తన ఫొటోలు, వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో (Social media) హల్‌చల్ చేస్తోంది. బార్బీ బొమ్మలాంటి ముఖ సౌందర్యం.. చూడగానే దిమ్మతిరిగే దేహదారుఢ్యం ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
(Image : vladigalagan Insta)
వ్లాడిస్లావా గలగన్.. రష్యాకు (Russia)చెందిన ఓ లేడీ బాడీ బిల్డర్ (Bodybuilder). ఆమె చూడటానికి అచ్చం అమెరికన్ మోడల్ కెండల్ జెన్నర్‌లా (Kendal Jenner) ఉంటుంది. అందుకే అంతా ‘కెండల్ జెన్నర్ ఆన్ స్టెరాయిడ్స్’ అని పేరు పెట్టేశారు. ఈ బాడీ బిల్డర్‌కు కేవలం కండలే కాదండోయ్.. అందం కూడా చాలా ఎక్కువ. ఆ అందానికి ఫిదా అయ్యే ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఓన్లీ ఫ్యాన్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో (Social media)లక్షలాది మంది ఫాలో అవుతున్నారు. కొందరు ఆమెను ‘రియల్ లైఫ్ షీ హల్క్’ అంటూ పొగిడేస్తున్నారు.
కృత్రిమ మేధ కాదు..!
ఈ మధ్య కాలంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. కృత్రిమ మేధ సాయంతో అందమైన న్యూస్ యాంకర్లను సృష్టిస్తున్నారు. రోబోలకు సుందరమైన రూపాన్ని జోడిస్తున్నారు. యాప్‌ల సహాయంతో పురుషులు.. స్త్రీలా మారితే ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. స్త్రీలు.. పురుషుడిలా మారితే ఎలా కన్పిస్తారో ఆ యాప్‌లు క్షణాల్లో మాయాజాలం చేసి చూపిస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో వ్లాడిస్లావా గలగన్ అందమైన ముఖారవిందాన్ని, కండలు తిరిగిన శరీరాన్ని చూస్తే ఇది కూడా కృత్రిమ మేధ చేసిన మాయేనా అనిపిస్తుంది. కానీ, తను నిజమైన మనిషే. ఏళ్ల కొద్దీ చెమటోడ్చినందుకు దక్కిన ప్రతిఫలమే ఆ దృఢమైన, బలమైన దేహం.
16 ఏళ్ల వయసులో..
వ్లాడిస్లావా గలగన్ రష్యాలోని టెమ్రియుక్‌లో జన్మించింది. 16 ఏళ్ల ప్రాయంలో జిమ్‌కు వెళ్లడం ప్రారంభించిన ఆమె.. తరువాత జిమ్‌నే తన కెరీర్‌గా మలుచుకుంది. ఇప్పుడు వ్లాడిస్లావా వయసు 27 సంవత్సరాలు. నిత్యం వ్యాయామాలపై దృష్టి సారిస్తూ తన పలకల దేహాన్ని తీర్చిదిద్దుకుంది. వారంలో కనీసం ఆరురోజులు తప్పకుండా జిమ్‌కు వెళ్తుంది. దాదాపు 90 నిమిషాలు వర్కౌట్ల కోసం కేటాయిస్తుంది. నాలుగు సార్లు ఆహారం తీసుకుంటుంది. అందులో ప్రోటీన్లు అధికంగా ఉండే బీఫ్, గుడ్లు, టర్కీ, చికెన్, ఫిష్ ఉండేలా చూసుకుంటుంది.
పురుషుల్ని ఓడిస్తుందట!
చూడటానికి అచ్చంగా అమెరికన్ మోడల్ కెండల్ జెన్నర్‌లా ఉండటంతో వ్లాడిస్లావా గలగన్‌కు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. తాను ఆర్మ్ రెజ్లింగ్ చేస్తున్న వీడియోలను అందులో పోస్టు చేస్తుంటుంది. గలగన్ కండబలం ముందు పురుషులు కూడా ఓడిపోవాల్సిందే. ఇవే కాకుండా తాను తరచూ చేసే వర్కౌట్ల గురించి వీడియోలు పోస్టు చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ లేడీ బాడీ బిల్డర్ చెక్ రిపబ్లిక్‌లోని ప్రాగ్‌లో నివసిస్తోంది. ఆమె ఫొటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో చూసిన వారంతా నకిలీ మనిషి అని, ఫొటోషాప్ చేశారని విమర్శిస్తుంటారు. అయితే ఈ రూపం కఠోర శ్రమ, జన్యుపరంగా సంక్రమించిన శక్తి వల్లే సాధ్యమైందని గలగన్ ఓ మీడియా సంస్థతో వెల్లడించింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
World News
2000 Notes: గల్ఫ్‌లోని భారతీయులకు రూ.2000 నోట్ల కష్టాలు
-
General News
CM Kcr: కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం.. రెండ్రోజుల్లో విధివిధానాలు: సీఎం కేసీఆర్
-
Crime News
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. మరో నలుగురు అరెస్టు