తితిదే నిధులపై కాగ్‌తో ఆడిట్‌ చేయించండి

నిధుల వినియోగంపై కాగ్‌తో ఆడిట్‌ చేయించాలని తితిదే ధర్మకర్తల మండలి ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గత నెల 27 జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం...

Published : 03 Sep 2020 14:00 IST

ప్రభుత్వాన్ని కోరిన ధర్మకర్తల మండలి

తిరుమల: నిధుల వినియోగంపై కాగ్‌తో ఆడిట్‌ చేయించాలని తితిదే ధర్మకర్తల మండలి ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గత నెల 27 జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. ఇకపై ప్రతిఏటా నిధుల వినియోగంపై కాగ్‌ ద్వారా ఆడిట్‌ చేసేలా తీర్మానం చేసింది. 2014-15 నుంచి 2019-20 మధ్య నిధుల వినియోగంపై రీ ఆడిట్‌ చేయాలని నిర్ణయించింది. గతంలో ఆడిట్ ప్రక్రియను అంతర్గతంగా నిర్వహించేవారు. ప్రభుత్వం అనుమతించిన తర్వాత కాగ్‌ ఆడిట్‌ ప్రక్రియ ప్రారంభించనుంది. నిధుల వినియోగంపై పారదర్శకత తీసుకురావాలన్న ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తితిదే నిధులపై స్వతంత్ర సంస్థలతో ఆడిట్‌ నిర్వహించాలని కోరుతూ ఇప్పటికే న్యాయస్థానాల్లో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన నేపథ్యంలో ధర్మకర్తల మండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని