వివేకా హత్యకేసు.. సీబీఐ రెండో విడత దర్యాప్తు 

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ రెండో విడత విచారణ ప్రారంభించింది. జులైలో రెండు వారాల పాటు కడప, పులివెందులలో

Updated : 12 Sep 2020 17:45 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ రెండో విడత విచారణ ప్రారంభించింది. జులైలో రెండు వారాల పాటు కడప, పులివెందులలో పలువురు అనుమానితుతలను విచారించిన సీబీఐ దాదాపు 40 రోజుల తర్వాత మళ్లీ పులివెందులకు చేరుకుంది. దిల్లీ నుంచి పులివెందులకు చేరుకున్న సీబీఐ అధికారుల బృందం.. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మకాం వేసింది. హత్య కేసు వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. 

గతంలో జులై 13న కడపకు వచ్చిన అధికారులు జులై 30 వరకు విచారణ జరిపారు. పులివెందులలోని వివేకా ఇంట్లో కేసు రీకన్‌స్ట్రక్షన్‌ చేయడంతో పాటు వివేకా కుమార్తె సునీతను, పలువురు అనుమానితులను విచారించారు. కడపలో మకాం వేసి కేంద్ర కారాగారంలో అతిథిగృహంలో అనుమానితులను విచారించారు. శంకర్‌ రెడ్డి , సస్పెండ్‌ అయిన పులివెందుల సీఐ శంకరయ్యతో పాటు పీఏ కృష్ణారెడ్డి, వంటమనిషి లక్ష్మీదేవి సహా పది మందికి పైగా అనుమానితులను విచారించారు. వివేకా కుమార్తె హైకోర్టులో వేసిన పిటిషన్‌ ప్రకారం 15 మంది అనుమానితులు ఉన్నారు. వారందరినీ విచారించాల్సి ఉంది. ఇప్పటివరకు వారిలో ఐదుగురిని మాత్రమే విచారించారు. తదుపరి విచారణలో భాగంగా మిగిలిన వారందరినీ విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని