వ్యాక్సిన్‌ అందరికీ వేయాల్సిన అవసరం లేదు

దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ వేయాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. మంగళవారం జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా టీకా వేయాల్సిన అవసరముందని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు.

Updated : 02 Dec 2020 20:36 IST

కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌


దిల్లీ: దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ వేయాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. మంగళవారం జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా టీకా వేయాల్సిన అవసరముందని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి సాంకేతికపరమైన విషయాలు మాట్లాడేటపుడు సరైన సమాచారం ఉంటేనే మాట్లాడాలి అని ఆయన ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. వ్యాక్సిన్‌ ఇవ్వడం అనేది దాని సమర్థతపై ఆధారపడి ఉంటుందన్నారు. వైరస్‌ సంక్రమణ గొలుసు తెంచడమే వ్యాక్సిన్‌ ప్రధాన ఉద్దేశమని ఐసీఎంఆర్‌ డీజీ డా. బలరామ్‌ భార్గవ వెల్లడించారు. ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం దేశంలో కరోనా యాక్టివ్‌కేసులు 5లక్షల కంటే తక్కువగానే ఉన్నాయి. రోజూవారీగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీలు అధికంగా ఉండటంతో యాక్టివ్‌కేసుల శాతం తగ్గిందని వారు వెల్లడించారు. ఒక్కరోజులోనే 11,349 యాక్టివ్‌ కేసులు తగ్గాయని వారు తెలిపారు. గడచిన 24గంటల్లో కేరళ, దిల్లీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పడుతుండగా, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, అస్సాం, గోవాల్లో కేసుల సంఖ్య పెరుగుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని