IN PICS: ఊరు ‘గోదారయ్యింది’! 

ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. గంట గంటకూ ప్రవాహం పెరుగుతుండటంతో లోతట్టు గ్రామాల్లో జనజీవనం స్తంభించిపోయింది...........

Updated : 17 Aug 2020 22:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. గంటగంటకూ ప్రవాహం పెరుగుతుండటంతో లోతట్టు గ్రామాల్లో జనజీవనం స్తంభించిపోయింది. లంక గ్రామాలతో పాటు మన్యంలో దేవీపట్నం మండలం గోదావరి ఉద్ధృతికి చిగురుటాకులా వణుకుతోంది. ఆయా గ్రామాలు గత ఐదు రోజులుగా జలదిగ్బంధంలోనే చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

దేవీపట్నంలో ఇళ్లలోకి నీరు చొరబడటంతో నడుం లోతు నీటిలో ఉన్న దృశ్యం..


తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వంతెన వద్ద గోదావరి వరద ప్రవాహం ఇలా..


మడికిలో నీట మునిగిన బొప్పాయి తోట


బడుగువాని లంకలో పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యం


జొన్నాడ వంతెన వద్ద వరదనీటిలో గోదావరి మాత విగ్రహం


అయినవిల్లి వెదురుబీడెం కాజ్‌వే వద్ద వరద నీటిలో ప్రజల పడవ ప్రయాణం 


ముమ్మిడివరం మండలం లంక ఆఫ్‌ ఠాణేలంకలో చుట్టుముట్టిన వరదనీరు


 

బడుగువాని లంకలో స్థానికుల పడవ ప్రయాణం



 

తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలంలో 14 గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటి పరిధిలో 82 గ్రామాలు ఉన్నాయి. జనాభా దాదాపు 30వేలకు పైనే. ఈ వరదల దాటికి దాదాపు 4 వేల కుటుంబాలు వరద ముంపు ప్రభావానికి గురైనట్టు సమచారం.


దేవీపట్నంలో దండంగి, తొయ్యేదు సహా పలు గ్రామాలు నీటమునిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆలయాలు, పోలీస్‌ స్టేషన్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలలు అన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఆయా గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. 


వరద ముప్పు ఉందన్న భయంతో ఇప్పటికే అనేకమంది ముంపు గ్రామాల ప్రజలు మైదాన ప్రాంతంలోకి వెళ్లి తలదాచుకోగా.. ఇంకొందరైతే జలదిగ్బంధమైన గ్రామాల్లోనే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని