ఎరువుల కొరత రానీయొద్దు: నిరంజన్‌

రాష్ట్రంలో ఎరువుల కొరత రానీయకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 18 Jul 2020 23:36 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎరువుల కొరత రానీయకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇచ్చే యూరియా, ఎరువులను ఎప్పటికప్పుడు తీసుకోవాలని సూచించారు. బషీర్‌బాగ్‌లోని వ్యవసాయశాఖ కమిషనరేట్‌ నిరంజన్‌ రెడ్డి తనిఖీ చేశారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. అనంతరం ఎరువులు, రైతు వేదికల నిర్మాణంపై నిరంజన్‌రెడ్డి సమీక్షించారు. దసరా నాటికి రైతు వేదికలు సిద్ధం చేయాలని కోరారు. 2,588 రైతు వేదికలకు భూ సేకరణ పూర్తయిందని మంత్రికి అధికారులు వివరించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని