AP High Court : సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించండి: హైకోర్టు

మాన్సాస్‌ ట్రస్టు ఈవో సహకరించడం లేదని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు

Updated : 27 Jul 2021 15:04 IST

అమరావతి : మాన్సాస్‌ ట్రస్టు ఈవో సహకరించడం లేదని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు వేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. ఈవో వ్యవహార శైలిపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఛైర్మన్‌ అశోక్‌ గజపతి రాజు ఇచ్చే ఆదేశాలు పాటించాల్సిందేనని ఆదేశించింది. ఆడిట్‌ అధికారితో మాత్రమే ఆడిట్‌ చేయించాలని.. ఇతరుల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేసింది. ట్రస్టు సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. ట్రస్టు అకౌంట్స్‌ సీజ్‌ చేయాలంటూ ఈవో ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్‌ చేసింది. ట్రస్టు కింద ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్‌లో జోక్యం చేసుకోవద్దని ఈవోను ఆదేశించింది. పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని