Updated : 07 Sep 2020 09:54 IST

బరువు తగ్గాలనుందా?.. ఈ చిట్కాలు మీకోసమే!

ఇంటర్నెట్‌డెస్క్‌: మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. బరువును తగ్గించుకోడానికి నానాపాట్లు పడుతుంటారు. బరువులు ఎత్తడం, పరిగెత్తడం, నీరు ఎక్కువగా తాగడం లాంటివెన్నో చేస్తుంటారు. కానీ, కొన్ని సార్లు ఆశించినంత ఫలితం ఉండదు. ఎందుకంటే బరువును తగ్గించుకోవడంలో జీవక్రియదే ప్రధాన పాత్ర. దానిని మెరుగు పరచుకుంటేనే అనుకున్నది సులువుగా సాధించవచ్చు. జీవక్రియ సరిగా ఉంటే కేలరీలు సులువుగా ఖర్చయిపోయి అధిక బరువు సమస్య దరి చేరదు. అయితే, వయస్సు పెరుగుతున్న కొద్దీ  దీనిరేటు క్రమంగా తగ్గిపోతుంది. ఈ క్రమంలో బరువును అదుపులో ఉంచుకోవడానికి కొన్ని నియమాలు పాటిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దామా

1. సమపాళ్లలో తీసుకోండి

 శరీరానికి ప్రోటీన్లు, కొవ్వులు, పిండిపదార్థాలు స్తంభాల్లాంటివి. ఇవన్నీ అవసరమైన స్థాయిలో ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. మీ జీవక్రియ సక్రమంగా జరగాలంటే ఆహారంలో ఈ మూడింటినీ సమపాళ్లలో తీసుకోండి. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించి జీవక్రియ మెరుగు పరుస్తాయి.

2. ఎక్కువసార్లు తినడం తప్పేకాదు

రోజులో ఎక్కువసార్లు తింటే ఆనారోగ్యం పాలవుతారని చాలామంది అభిప్రాపడుతుంటారు. కానీ, అది చాలా తప్పు. మీరు  భోజనం మధ్యలో చిరుతిళ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా జీవక్రియ వేగతం పెంచుతుంది. అందువల్ల తక్కువ తక్కువగా ఎక్కువగా సార్లు తినడానికి ప్రయత్నించండి.

3. ఎన్ని కేలరీలు తింటున్నామో లెక్కలేయొద్దు
అయ్యో.. లావయిపోతున్నామే. ఎన్ని కేలరీలు తినేస్తున్నామో అంటూ చాలా మంది తెగ హైరానా పడిపోతుంటారు. ఎన్ని కేలరీలు తీసుకుంటున్నామో లెక్కలేసుకొని, క్రమంగా వాటిని తగ్గించేస్తుంటారు. అది మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మన శరీరం శక్తిని కోల్పోయి. జీవక్రియ రేటు మందగిస్తుంది.

4. టిఫిన్‌ పెంచండి.. భోజనం తగ్గించండి
సాధారణంగా మనం పని చేయాడానికి కావాల్సిన శక్తి ఉదయాన్నే తినే అల్పాహారం ద్వారానే లభిస్తుందంటారు. పడుకునే సమయంలో అవయవాలన్నీ విశ్రాంతి తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు మందగిస్తుంది. ఈ సమయంలో తక్కువ ఆహారం తీసుకోవడం మంచిది. అల్పహారంలో అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు, పిండిపదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అల్పహారమే ఎక్కువగా తీసుకోవాలన్నది నిపుణుల వాదన.

5. నీరు ఎక్కువగా తాగండి
జీవక్రియలో నీరు చాలా ముఖ్యం. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు సులువుగా బయటకు పోతాయి. అంతేకాకుండా ఎక్కువ కేలరీలు ఖర్చవ్వడంలో నీరు సహకరిస్తుంది. శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటే జీవక్రియ రేటు పడిపోతుంది.

6. ఫైబర్‌ ఎక్కువగా ఉండాలి
పీచుపదార్థాల్లో సున్నా కేలరీలు ఉంటాయి. కొవ్వులు కరిగించడంలో ఫైబర్‌ సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సాఫీగా సాగేలా చూస్తుంది. ఫలితంగా జీవక్రియ మెరుగుపడుతుంది. ఇందుకోసం మీ ఆహారంలో బీరకాయ, బీన్స్ తదితర పదార్థాలు ఉండేలా చూసుకోవడం మంచింది. బీన్స్‌లో ప్రోటీన్లు కూడా విరివిగా లభిస్తాయి.

7. కొవ్వూలూ మంచిదే!
కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే అధికబరువు వస్తుందని చెబుతుంటారు. అయితే అన్ని రకాల కొవ్వుల వల్ల ఇలా జరగదు. మనం తీసుకునే ఆహారంలో మోనోఅన్‌శాచురేటెడ్‌ కొవ్వులు ఉంటే జీవ క్రియ వేగం మెరుగుపడుతుందని అధ్యయనాల్లో తేలింది.

8. స్నాక్స్‌ తినడం మానొద్దు
బరువు తగ్గాలనుకునే వారు చాలా మంది ముందుగా స్నాక్స్‌ తినడం మానేస్తుంటారు. ఆ సమయంలో ఏమీ తీసుకోకపోతే బాగా ఆకలి అనిపిస్తుంది. భోజనం సమయంలో మనకు తెలియకుండానే కాస్తా ఎక్కువ తినేస్తాం. అందువల్ల వీలైనంత వరకు అప్పుడప్పుడూ స్నాక్స్‌ తినాల్సిందే. బదులుగా ఆహారం తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. స్నాక్స్‌లో కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఉండేట్లు చూసుకోవాలి. భోజనంలో వీటికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల జీవక్రియ రేటు పెరిగి ఆరోగ్యంగా ఉంటాం.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని