Medak: అర్ధరాత్రి ఆస్పత్రికి గర్భిణీ.. తాళం ఉండటంతో కటిక నేలపై ప్రసవం

అర్ధరాత్రి పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రికి వస్తే.. తాళం వేసి ఉండటంతో వరండాలోనే మహిళ ప్రసవించింది.

Updated : 12 Mar 2024 15:26 IST

మెదక్‌: అర్ధరాత్రి పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రికి వస్తే.. తాళం వేసి ఉండటంతో వరండాలోనే మహిళ ప్రసవించింది. కారు చీకట్లో కటిక నేలపై ప్రసవ వేదన పడుతూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ హృదయవిదారక ఘటన మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

వెల్దుర్తి గ్రామానికి చెందిన తాటి సృజన పురిటి నొప్పులతో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చింది. డ్యూటీలో ఉండాల్సిన వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. పైగా ఆస్పత్రికి తాళం వేసి ఉండడంతో ప్రసవ వేదన పడుతూ వరండాలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు డాక్టర్‌ రాలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి డా.చందు నాయక్‌ను వివరణ కోరగా.. రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న సిస్టర్‌ జయంతికి మెమో ఇచ్చామని, వైద్యుడిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని