APSRTC: ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం?

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో బస్సు ఛార్జీలు పెంచేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Updated : 13 Apr 2022 12:50 IST

అమరావతి: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో బస్సు ఛార్జీలు పెంచేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రతిపాదనల దస్త్రాన్ని ఆర్టీసీ అధికారులు వారం క్రితమే సిద్ధం చేసి సీఎం జగన్‌ వద్దకు పంపినట్లు తెలిసింది. 

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై ప్రకటన చేసే అవకాశముంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని