Telangana News: నేడు బంద్‌ పాటించనున్న ఆటో, క్యాబ్‌, లారీ సంఘాలు

కొత్త మోటారు వాహనాల చట్టం అమలును నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఆటోలు, క్యాబ్‌లు, లారీల డ్రైవర్ల సంఘాలు నేడు బంద్‌ పాటించనున్నాయి.

Updated : 19 May 2022 01:00 IST

హైదరాబాద్‌: కొత్త మోటారు వాహనాల చట్టం అమలును నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఆటోలు, క్యాబ్‌లు, లారీల డ్రైవర్ల సంఘాలు నేడు బంద్‌ పాటించనున్నాయి. ఒకరోజు పాటు బంద్‌ పాటించాలని డ్రైవర్ల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఫిట్‌నెస్‌ పత్రాల ఆలస్యానికి జరిమానా విధించడంపై డ్రైవర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫిట్‌నెస్‌ పత్రాలు ఆలస్యంపై రవాణాశాఖ రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధిస్తోంది. దీంతో జరిమానా రద్దుచేయాలని క్యాబ్‌, ఆటో, లారీ డ్రైవర్లు డిమాండ్‌ చేస్తున్నారు. డ్రైవర్ల సంఘాల పిలుపుమేరకు బుధవారం అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్‌, లారీ సర్వీస్‌లు ఆగిపోనున్నాయి. గురువారం ట్రాన్స్‌పోర్టు భవన్‌ ముట్టడికి డ్రైవర్ల ఐకాస పిలుపునిచ్చింది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని