‘దిశ’ను ఆమోదించండి: సీఎం జగన్‌

మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన ‘దిశ’ చట్టాన్ని సత్వరమే ఆమోదించాలని ఏపీ సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు

Published : 02 Jul 2021 19:32 IST

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ

అమరావతి: మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన ‘దిశ’ చట్టాన్ని సత్వరమే ఆమోదించాలని ఏపీ సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి జగన్‌ లేఖ రాశారు. దిశ బిల్లు ఆమోదం వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ‘దిశ’ ప్రాజెక్టుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేసిన సీఎం కేంద్ర మంత్రికి లేఖ రాయాలని నిర్ణయించారు.

‘‘మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే ఏడు రోజుల్లోనే దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వేగంగా విచారణ జరిపేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి ఇద్దరు మహిళా ఉన్నతాధికారులను  నియమించాం. 18 దిశ మహిళా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశాం. ఆపత్కాల సమయంలో మహిళలకు సత్వరమే పోలీసు సాయం అందించేందుకు దిశ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ యాప్‌ను ఇప్పటివరకు 19.83 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకోగా.. 3,03,752 మంది ఎస్‌ఓఎస్‌ ద్వారా సాయం కోరారు. 221 కేసులు నమోదవగా.. 1,823 కాల్స్‌ను పరిష్కరించాం. ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటు, బలోపేతం చేయడం సహా సిబ్బందిని నియమించాం. పోలీసు స్టేషన్‌లో 700 మహిళా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశాం. 900 పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశాం. 12 దిశ మహిళా కోర్టులు, 9 పోక్సో కోర్టులు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేశాం. చట్టం అమలు కోసం పలు కీలక చర్యలు తీసుకుంటోన్న దృష్ట్యా బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు దిశ చట్టాన్ని ఆమోదించాలి’’ అని సీఎం జగన్ తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని