CM Jagan: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇకపై ప్రతిరోజూ స్పందన: సీఎం జగన్‌

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇకపై ప్రతిరోజూ స్పందన కార్యక్రమం నిర్వహించాల్సిందేనని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటల

Published : 24 Aug 2022 01:56 IST

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇకపై ప్రతిరోజూ స్పందన కార్యక్రమం నిర్వహించాల్సిందేనని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5గంటల వరకు సిబ్బంది మొత్తం అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్య అంశంగా ఈ కార్యక్రమాన్ని గుర్తించి కలెక్టర్‌లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఫోన్‌ నెంబరుతో కూడిన పోస్టర్లు ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా.. ఉపాధి హామీ పనులు, విద్య, వైద్యారోగ్యశాఖలో నాడు- నేడు, ఇళ్ల పట్టాలు, గృహనిర్మాణం, జగనన్న భూ హక్కు.. భూ రక్ష, స్పందన తదితర అంశాలపై సమీక్షించారు. రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు, హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం.. పనులు వేగవంతం చేసి అక్టోబరు 31 నాటికల్లా నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని, నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 90 రోజుల్లో పట్టా మంజూరు చేయాలని, దీనికోసం అవసరమైన ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని