నెల్లికల్లు ఎత్తిపోతలకు కేసీఆర్‌ శంకుస్థాపన

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. రూ.3వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న నెల్లికల్లు ఎత్తిపోతలతో ..

Updated : 10 Feb 2021 15:09 IST

నెల్లికల్లు: నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. రూ.3వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న నెల్లికల్లు ఎత్తిపోతలతో పాటు మరో 12 ఎత్తిపోతల పథకాలు, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కొత్తగా చేపట్టనున్న ఎత్తిపోతల పథకాల ద్వారా హుజూర్‌ నగర్‌, సాగర్‌, దేవరకొండ పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందనుంది. యాదాద్రి జిల్లాలోని గంధమల్ల, బస్వాపూర్‌ గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు. ఎత్తిపోతలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చివరి భూములకు కృష్ణా జలాలు చేరనున్నాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక, పట్టభద్ర ఎమ్మెల్సీల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు నూతనోత్సాహాన్ని ఇచ్చే లక్ష్యంతో నల్గొండ జిల్లా హాలియాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. 

ఇవీ చదవండి...

స్వచ్ఛ కంప్యూటర్‌కు పంచ సూత్రాలు.. 

చెమట ఇంధనం.. చరిత వందనం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని