Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తాపడిన టెంపో.. 13 మందికి గాయాలు
తిరుమల నుంచి తిరుపతికి మొదటి ఘట్ రోడ్డు మీదుగా కిందికి దిగుతున్న టెంపో వాహనం బోల్తాపడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.
తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి మొదటి ఘట్ రోడ్డు మీదుగా కిందికి దిగుతున్న టెంపో వాహనం బోల్తాపడింది. కర్ణాటకలోని కోలార్‌కు చెందిన భక్తులు.. శ్రీవారిని దర్శించుకొని మొదటి ఘాట్ రోడ్డులో కిందికి దిగుతుండగా ఆరో మలుపు వద్ద వాహనం రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 13మంది భక్తులు గాయపడ్డారు. ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
గాయపడిన భక్తులను ప్రభుత్వ రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన భక్తులకు మెరుగైన చికిత్స అందించాలని తితిదే ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. జేఈవో వీరబ్రహ్మం క్షతగాత్రులను రుయా నుంచి బర్డ్ హస్పిటల్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఘాట్ రోడ్డులో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఈవో ధర్మారెడ్డి విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య
-
ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి..! ‘ఆదిత్య ఎల్1’పై ఇస్రో కీలక అప్డేట్
-
Hyderabad: మర్రిగూడ తహసీల్దార్ అరెస్ట్.. అక్రమాస్తులు రూ.4.75 కోట్లు
-
Alia Bhatt: అప్పుడు మా వద్ద డబ్బుల్లేవు.. నాన్న మద్యానికి బానిసయ్యారు: అలియాభట్
-
Nara Lokesh: జగన్ మాదిరిగా వాయిదాలు కోరను.. సీఐడీ నోటీసుపై స్పందించిన లోకేశ్