ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13-03-2022)

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13-03-2022)

Updated : 13 Mar 2022 06:52 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. చేపట్టిన పనులలో విజయ దుందుభులు మ్రోగిస్తారు. ఇష్టదేవత శ్లోకాన్ని చదివితే మంచిది.

మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

బంగారు భవిష్యత్తుకై వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆద్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వలన ఇంటగెలుస్తారు. శివారాధన శుభప్రదం.

కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. 

 

అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.

మిశ్రమ ఫలితాలున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక విషయంలో ధైర్యంతో ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు. కుటుంబ విషయాల్లో ఓర్పు అవసరం. శ్రీ విష్ణు,సూర్య ఆరాధన మంచిది.  

శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. శ్రీ వేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని