Cocacola Lake: కోకాకోలా సరస్సుని చూశారా?

అదేంటి కోకాకోలా పేరుతో కూల్‌డ్రింక్‌ ఉంటుంది కానీ సరస్సేంటని ఆశ్చర్యపోతున్నారా. అవును నిజంగానే కోకాకోలా సరస్సు ఉంది. దక్షిణ అమెరికాలోని రియో గ్రాండ్ డెల్ నార్టే అనే ప్రాంతంలో ఉండే ‘లాగావో దె కోకాకోలా’  ఒక పర్యాటక ప్రదేశం కూడా. కేవలం పేరు మాత్రమే దీని ప్రత్యేకత అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఎందుకంటే కళ్లన్ని కట్టిపడే అరుదైన దృశ్యరూపం దీని సొంతం.

Updated : 12 Aug 2021 01:39 IST

బ్రెజిల్‌లో ఉందీ రంగురంగుల సరస్సు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అదేంటి కోకాకోలా పేరుతో కూల్‌డ్రింక్‌ ఉంటుంది కానీ సరస్సేంటని ఆశ్చర్యపోతున్నారా. అవును నిజంగానే కోకాకోలా సరస్సు ఉంది. దక్షిణ అమెరికాలోని రియో గ్రాండ్ డెల్ నార్టే అనే ప్రాంతంలో ఉండే ‘లాగావో దె కోకాకోలా’  ఒక పర్యాటక ప్రదేశం కూడా. కేవలం పేరు మాత్రమే దీని ప్రత్యేకత అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఎందుకంటే కళ్లన్ని కట్టిపడే అరుదైన దృశ్యరూపం దీని సొంతం. అదేంటే ఇందులోని నీరంతా  బ్లూ, వయోలెట్‌, పింక్‌, రెడ్‌, ఆరెంజ్‌ రంగులు.. ఇలా నీరంతా వివిధ రంగుల్లో దర్శనమివ్వడం విశేషం. ఈ సరస్సు అసలు పేరు అరారాకురా అయినప్పటికీ.. ఇన్ని ప్రత్యేకతలు ఉండటంతో దీనికి ‘కోకాకోలా’ అనే పేరువచ్చిందట. 

ఎందుకిన్ని రంగులంటే..
ఇలాంటి సరస్సుని మనం ఎక్కడా చూసుండం. సాధారణంగా మట్టి నేలను బట్టి నీరు రంగు ఉంటుంది. ఇక్కడ మాత్రం నీరంతా..మరి ఇన్ని రంగులు రావడానికి వెనుక శాస్ర్తీయ కారణం ఉంది. అదేంటంటే.. భూభాగంలో ఐరన్‌ యాక్సైడ్‌, ఐయోడిన్ల స్థాయులు ఎక్కువగా ఉండటమేనట. నీటి చుట్టూ తెల్లటి ఇసుక దిబ్బలు ఉన్న ఈ సరస్సుకి హీలింగ్‌ పవర్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయని.. నీరంతా పరిశుభ్రంగా ఉండటంతో ఈత కొట్టడానికి పర్యాటకులు వస్తుంటారని  బ్రెజిల్‌ టూరిజం వెబ్‌సైట్స్‌ తెలిపాయి.

 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు