Hyderabad - Budwel Lands: ఈసారి ‘బుద్వేల్‌’కు నోటిఫికేషన్‌.. ఎకరాకు కనీస ధర రూ.20కోట్లు

కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధరలు వచ్చిన తరుణంలో అదే తరహాలో బుద్వేల్ భూముల అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

Updated : 04 Aug 2023 17:20 IST

హైదరాబాద్: నగరంలోని కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధరలు వచ్చిన నేపథ్యంలో అదే తరహాలో బుద్వేల్ భూముల అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో బహుళ ప్రయోజన నిర్మాణాలకు అనుగుణంగా.. మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండీఏ ద్వారా విక్రయించనున్నారు. 

Kokapet Neopolis: ఎకరం రూ.100 కోట్లు!

బుద్వేల్‌లో మొత్తం 14 ప్లాట్లను అమ్మకానికి ఉంచారు. ఒక్కో ప్లాటు విస్తీర్ణం 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల వరకు ఉంది. ఎకరాకు రూ.20 కోట్ల కనీస ధరను నిర్ణయించారు. ఆరో తేదీన ప్రీబిడ్ సమావేశం.. ఎనిమిదో తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 10న ఈ -వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. బుద్వేల్ భూములు ఎకరాకు సగటున రూ.30కోట్ల ధరకు అమ్ముడుపోయినా.. కనీసం రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ అంచనా వేస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని