Viral Video: ఏనుగు సీరియస్‌గా తీసుకుని ఉంటే.. కథ వేరేలా ఉండేది మరి!

కేరళలోని (Kerala) ముతంగలో ఏనుగు ఇద్దరి వెంట పడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

Updated : 03 Feb 2024 06:51 IST

తిరువనంతపురం: ఏనుగు వెంటబడితే ఎలా ఉంటుందో తెలియదు గానీ.. ఈ వీడియో చూస్తే మాత్రం మన వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కేరళలోని (Kerala) ముతంగలో జరిగిన ఓ ఘటనలో ఇద్దరు వ్యక్తులను ఏనుగు వెంటడబడి తరిమింది. వేగంగా పరిగెత్తే క్రమంలో అందులోని ఓ వ్యక్తి కింద పడిపోయాడు. అయితే ఏనుగు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. లేదంటే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. దీనికి సంబంధించి వీడియోను సోషల్‌ మీడియాల్లో పోస్టు చేయడంతో వైరల్‌ (Viral Video) అయ్యింది. 

అసలేం జరిగిందంటే.. ఓ కుటుంబం ఊటీకి వెళ్తోంది. మార్గమధ్యంలో ముతంగ వద్ద ఏనుగు కనబడితే కారు ఆపి ఫొటోలు తీసేందుకు అందులోని ఇద్దరు వ్యక్తులు కిందకు దిగారు. అయితే వారిపై అది దాడి చేస్తుందని ఊహించలేదు. ఒక్కసారిగా ఏనుగు వారి వెంట పరిగెత్తడంతో హడలిపోయారు. ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఏనుగు (elephant) కూడా అంతే వేగంగా పరుగుపెట్టడందో... ఏ దిక్కుకు వెళ్లాలో కూడా అర్థం కాలేదు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కిందపడిపోయాడు. వెంటనే ఏనుగు వెనక్కి తిరిగి కాళ్లతో తొక్కేందుకు ప్రయత్నించి వదిలేసింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో సదరు వ్యక్తి ఊపిరిపీల్చుకున్నాడు.  

‘‘ఏనుగు హెచ్చరించి వదిలేసింది. అది సీరియస్‌గా తీసుకుని ఉంటే.. కథ వేరేలా ఉండేది’’. ‘‘అసలు మీరు కారులో నుంచి ఎందుకు దిగారు?’’. ‘‘అడవి ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు కారులో నుంచి ఎందుకు దిగకూడదో ఇది ఒక ఉదాహరణ’’.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు